హంతకుడిని పట్టించిన గుండీ

Police solve 7-month-old murder case using shirt button - Sakshi

ఔరంగాబాద్‌: చిన్న ఆధారమూ క్రిమినల్‌ కేసులో ఎంత కీలకంగా మారుతోందో చెప్పే ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఔరంగాబాద్‌లో బికన్‌ నిలోబ జాదవ్‌ను ఏడు నెలల క్రితం కొందరు హత్య చేశారు. ఘటనా స్థలంలో పోలీసులకు గుండీ మాత్రమే దొరికింది. గుండీ మీద రోప్‌లాస్ట్‌ స్టిచ్‌ అనే అక్షరాలు ఉండటంతో పోలీసులు ఆయా విక్రేతల నుంచి ఎవరెవరు చొక్కాలు కొనుగోలు చేశారో పరిశీలించారు. దాదాపు 10 వేల మంది వారి నుంచి చొక్కాలను కొనగా అందులో 246 మందికి నేరచరిత్ర ఉంది. అందులో హత్యకు నాలుగు రోజుల ముందు రగాడే అనే వ్యక్తి కత్తులను కొనుగోలు చేశాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో మిగిలిన వారి పేర్లు కూడా బయటకు వచ్చాయి. అజయ్‌ రగాడే, చేతన్‌ గైక్వాడ్, సందీప్‌ గైక్వాడ్‌లు ఈ హత్య చేసినట్లు పోలీసులు అభియోగాలు మోపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top