వ్యభిచారగృహంపై దాడి | Police Attack on Prostitution House Hyderabad | Sakshi
Sakshi News home page

వ్యభిచారగృహంపై దాడి

Oct 18 2019 11:33 AM | Updated on Oct 18 2019 11:33 AM

Police Attack on Prostitution House Hyderabad - Sakshi

పోలీసుల అదుపులో నిర్వాహకులు, విటుడు

మీర్‌పేట: వ్యభిచార గృహంపై ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంఘటన గురువారం మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్రీరమణ కాలనీకి చెందిన ప్రణయ నందిని (28) గత కొన్ని రోజులుగా తన ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోంది. దీనిపై సమాచారం అందడంతో ఎల్‌బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు గురువారం ఇంటిపై దాడి చేసి నిర్వాహకురాలు నందినితో పాటు మరో నిర్వాహకుడు బద్దం నిరంజన్, విటుడు సప్పిడి శ్రీకాంత్‌రెడ్డితో ఓ యువతిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 3,180 నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని మీర్‌పేట పోలీసులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement