భార్యకు కరెంట్‌ షాక్‌ ఇచ్చి చంపాడు

Person Killed Wife By Giving Current Shock In Prakasam - Sakshi

సాక్షి, ప్రకాశం : పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామం ఎస్సీ పాలెంలో మంగళవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ పాలెంకు చెందిన తంగిరాల యోహాను, శ్రావణి (28) భార్యభర్తలు. మద్యానికి బానిసైన యోహాను నిత్యం భార్యను వేదించేవాడు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున ఇంటికి వచ్చిన యోహాను శ్రావణితో గొడవపడ్డాడు. విచక్షణ కోల్పోయిన యోహాను కరెంటు షాక్‌ ఇవ్వడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. కాగా నిందితుడితో పాటు అతని కుటుంబసబ్యులు పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ దంపతులకు ఒక బాబు(4), పాప(2) ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top