మిక్సీలో బంగారం దాచి అడ్డంగా దొరికిపోయాడు..! | Passenger Conceals Gold In Mixer Grinder | Sakshi
Sakshi News home page

మిక్సీలో బంగారం దాచి అడ్డంగా దొరికిపోయాడు..!

Feb 12 2020 9:21 PM | Updated on Feb 12 2020 9:21 PM

Passenger Conceals Gold In Mixer Grinder - Sakshi

సాక్షి, శంషాబాద్‌: మిక్సీలో 1,725 గ్రాముల బంగారాన్ని దాచి దుబాయ్‌ నుంచి తీసుకొచ్చిన ప్రయాణికుడిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకుని, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం దుబాయ్‌ నుంచి వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడు మిక్సీని తెచ్చాడు. అనుమానం వచ్చిన అధికారులు మిక్సీ విడి భాగాలను వేరుచేసి పరిశీలించగా 1,725 గ్రాములు బంగారం బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement