మన్యంలో ఉపాధ్యాయురాలిపై మృగాడి వికృత చేష్టలు

In Paderu A Man Arrested For Harassing A Tribal Teacher - Sakshi

సాక్షి, పాడేరు: విశాఖ మన్యంలో ఓ మృగాడి వికృత చేష్టలకు గిరిజన ఉపాధ్యాయురాలు మానసిక క్షోభను అనుభవిస్తుంది. రోజు రోజుకు ఆగడాలు శృతిమించుతుండడంతో ఎట్టకేలకు ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.  పాడేరు ప్రాంతంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గిరిజన మహిళ భర్త 15 నెలల క్రితం మృతి చెందాడు. దీంతో ఆమె తన ఇద్దరి పిల్లలతో కలిసి నివసిస్తుంది. పొట్టకూటి కోసం వలస వచ్చిన తూర్పుగోదావరి జిల్లా దివిలీకి చెందిన ఆకుల అచ్యుత్‌కుమార్‌ చూపు ఆమెపై పడింది.

తాను అండగా ఉంటానని, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ రహస్యంగా ఉపాధ్యాయురాలి ఫొటోలు చిత్రీకరించాడు. ఏజెన్సీలో పనిచేస్తున్న సుమారు 250 మంది ఉపాధ్యాయుల ఫోన్‌ నంబర్లు సేకరించి వాట్సాఫ్‌ గ్రూపు తయారు చేశాడు. వాట్సాప్‌ గ్రూపుతో పాటు ఫేస్‌బుక్‌లో కూడా ఉపాధ్యాయురాలి అసభ్యకర ఫొటోలను అప్‌లోడ్‌ చేశాడు. ఈ సంఘటనపై ఆమె గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజు రోజుకు అచ్యుత్‌ కుమార్‌ ఆగడాలు ఎక్కువ కావడంతో ఇటీవల ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

చదవండి: మద్యం, మాంసం రుచిచూపి.. ప్రియుడితో కలిసి

ఈ విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు ఆమెకు ధైర్య చెప్పి మరోసారి మహిళ ఉద్యోగ సంఘం తరఫున పోలీసులకు వాస్తవాలను వివరించి సాక్ష్యాలను అందజేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ సంఘటనపై పోలీసుల వాదన మరోలా ఉంది. ఉపాధ్యాయురాలి భర్త చనిపోయిన అనంతరం అచ్యుత్‌కుమార్, ఉపాధ్యాయురాలు అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నారని, కుటుంబ కారణాల రీత్యా వీరిద్దరు దూరమయ్యారంటున్నారు.

తన భార్యతో కలిసే ఉంటానని కోర్టును ఆశ్రయించగా భార్య పోలీసు స్టేషనులో వేధిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరు కలిసారని, అచ్యుత్‌కుమార్‌ వద్ద ఉంటున్న మొబైల్‌లో ఓ వీడియో బయటకు వచ్చిందన్నారు. ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు ఈ నెల 6న పాడేరులో అచ్యుత్‌కుమార్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా తమపై దాడికి ప్రయత్నించారన్నారు. దీంతో నిందితుడిపై రెండు కేసులు నమోదు చేసి 6న రాత్రి రిమాండ్‌కు పంపించామని చెప్పారు. ఉపాధ్యాయురాలు పోలీసులపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top