విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన.. సైంటిస్ట్‌ అరెస్టు | OU Police Arrested To Scientist Bhaskara Chary In Hyderabad | Sakshi
Sakshi News home page

విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన.. సైంటిస్ట్‌ అరెస్టు

Jun 2 2018 5:50 PM | Updated on Nov 9 2018 5:06 PM

OU Police Arrested To Scientist Bhaskara Chary In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దళిత విద్యార్థిని పట్ల ఎన్‌ఐఎన్‌ సైంటిస్ట్‌ భాస్కరా చారి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన నగరంలోని తార్నాక జాతీయ పోషకాహార సంస్థలో శనివారం చోటుచేసుకుంది. తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఓయూ పోలీసులు శాస్త్రవేత్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

దీనిపై కాచిగూడ ఏసీపీ నర్సయ్య మాట్లాడుతూ.. తనపై అసభ్యంగా ప్రవవర్తించాడని ఓ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. దీంతో మే 18న ఆ సైంటిస్ట్‌పై కేసు నమోదైంది. విచారణలో అన్ని ఆధారాలు సేకరించామని తెలిపారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఏసీపీ నర్సయ్య తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement