మరో ఆన్‌లైన్‌ మోసం..  | Online Fraud In Denkada | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డ్రా..

Jul 9 2018 11:15 AM | Updated on Jul 9 2018 11:15 AM

Online Fraud In Denkada - Sakshi

బాధితురాలు మహంతి లక్ష్మి 

డెంకాడ : మండలంలోని గుణుపూరు గ్రామానికి చెందిన మహంతి లక్ష్మికి చెందిన బ్యాంక్‌ ఖాతా నుంచి గుర్తు తెలియని వ్యక్తి నగదు స్వాహా చేశాడు. వివరాల్లోకి వెళితే.. లక్ష్మికి ఏపీజీవీబీ డెంకాడ బ్రాంచిలో ఖాతా ఉంది.

కొద్ది రోజుల కిందట ఓ అగంతుకుడు నుంచి లక్ష్మికి ఫోన్‌ వచ్చింది. తాను బ్యాంక్‌ మేనేజర్‌నని.. మీ ఏటీఎం బ్లాక్‌ అయిందని.. ఆధార్‌ నంబర్‌ చెబితే పునరుద్ధరిస్తామని చెప్పడంతో బాధితురాలు వివరాలు చెప్పింది.

అలాగే మరికొన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ చెప్పాలని కోరడంతో బాధితులు చెప్పేశారు. ఇలా రెండేసార్లు చెప్పిన తర్వాత అనుమానం వచ్చిన బాధితులు బ్యాంక్‌లో సంప్రదించగా, వచ్చిన ఫోన్‌ నకిలీదని తేలింది. అయితే అప్పటికే లక్ష్మి ఖాతా నుంచి రూ. 25 వేలను అగంతుకుడు డ్రా చేసేశాడు.  ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement