ధర్మపురిలో కాల్పులు..ఒకరి మృతి

One Shot Dead In Dharmapuri - Sakshi

ధర్మపురి: ఎల్లమ్మ బోనాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తిని ధర్మపురిలో గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. రామగుండంకు చెందిన పోడేటి సత్యనారాయణగౌడ్‌ (51) హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. బుధవారం బంధువులతో కలసి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమాలాపూర్‌లో ఎల్లమ్మ బోనాల్లో పాల్గొనేందుకు వచ్చారు. రాత్రి 10 గంటలకు తమ బంధువులు భైరవేని రాకేశ్, వెంకటేశ్, బావమరిది రాజు, నోముల వెంకటేశ్‌లతో కలసి ధర్మపురిలో ఉన్న సత్య వైన్స్‌ వద్దకు వెళ్లారు. వాహనం దిగి షాపు వద్దకు వెళ్లి చూడగా అప్పటికే వైన్స్‌ మూసి ఉంది. తిరిగి వాహనం ఎక్కుతుండగా అక్కడే మాటు వేసి ఉన్న నల్లదుస్తులు ధరించిన ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. దీంతో సత్యనారాయణ ఛాతీ, మెడపై తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలొదిలారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top