వృద్ధురాలి అనుమానాస్పద మృతి | Old Woman Found Dead In Her Flat In Ayodhya Nagar | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి అనుమానాస్పద మృతి

May 18 2019 8:27 PM | Updated on May 18 2019 8:34 PM

Old Woman Found Dead In Her Flat In Ayodhya Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అయెధ్యనగర్‌లో వృద్ధురాలి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. శారద అపార్టుమెంటులోని తన ఫ్లాట్‌లో రాధా పూర్ణిమ(62) అనే మహిళ శవంగా మారడం అనుమానాలకు తావిస్తోంది. వివరాలు.. రాధాపూర్ణిమ డీఆర్‌డీఎల్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం ఆమె అయోధ్యనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తన ఫ్లాట్‌లో రాధాపూర్ణిమ మృతి చెందారు. ఈ విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శవానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement