వృద్ధుల అనుమాస్పద మృతి.. వీడని మిస్టరీ | Old Age Couple Mysterious Death On Outer Ring Road | Sakshi
Sakshi News home page

Jul 9 2018 12:14 PM | Updated on Jul 10 2019 7:55 PM

Old Age Couple Mysterious Death On Outer Ring Road - Sakshi

ఐదు రోజుల పాటు పటన్‌చెరు ఆస్పత్రిలోనే మృతదేహాలు

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల వలిమెల ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై వృద్ధ దంపతుల మృతి కేసు పోలీసులకు సవాలుగా మారింది. గత ఐదు రోజులగా కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నా మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించలేకపోతున్నారు. మృతుల సంబంధీకుల కోసం విచారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గత ఐదు రోజులుగా వృద్ధుల మృతదేహాలు పటన్‌చెరు ఆస్పత్రిలోనే ఉన్నాయి. అయితే మృతులది హత్యా లేదా ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని.. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement