అయ్యన్నపై మొదలైన విచారణ | Nirbhaya Case Inquiry Starts on Ayyanna Patrudu | Sakshi
Sakshi News home page

అయ్యన్నపై మొదలైన విచారణ

Jun 18 2020 12:32 PM | Updated on Jun 18 2020 12:34 PM

Nirbhaya Case Inquiry Starts on Ayyanna Patrudu - Sakshi

నర్సీపట్నం: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసుపై విచారణ కొనసాగుతుందని ఏఎస్పీ తుహన్‌ సిన్హా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు అసభ్య పదజాలంతో దూషించి, తన విధులకు భంగం కలిగించారని మున్సిపల్‌ కమిషనర్‌ తోట కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకున్యాయసలహా తీసుకుని ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేశామని ఏఎస్పీ తెలిపారు. బుధవారం ప్రాథమిక విచారణ ప్రారంభించామన్నారు. కేసును పట్టణ సీఐ దర్యాప్తు చేస్తున్నారన్నారు. విచారణ అనంతరం తీసుకునే చర్యలు గురించి వివరిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement