బెజవాడ గ్యాంగ్‌ వార్‌లో కొత్త ట్విస్ట్

New Twist In The Vijayawada Gang War - Sakshi

సాక్షి, విజయవాడ: బెజవాడ గ్యాంగ్‌ వార్‌లో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. పటమటలో ఆదివారం జరిగిన ఇరువర్గాల పరస్పర దాడులను రెండు విద్యార్థి గ్రూపుల మధ్య తలెత్తిన వివాదంగా మొదట అంతా భావించారు. మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ వివాదంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. రూ.2 కోట్ల విలువైన స్థలం కోసం ఘర్షణ జరిగినట్లు తెలిసింది. యనమలకుదురులో ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో భాగంగా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. (రేపటి నుంచి పట్టాలెక్కనున్న స్పెషల్‌ ట్రైన్లు)

ఒకే ల్యాండ్ విషయంలో ఇద్దరు జోక్యం చేసుకోవడంతో వివాదం తలెత్తింది. ల్యాండ్‌ దక్కించుకునేందుకు హత్యలకు ఇరువర్గాలు స్కెచ్‌ వేశాయి. రాజీ ముసుగులో ప్లాన్‌ అమలుకు రెండు గ్రూపులు సిద్ధమయ్యాయి. పక్కా ప్లాన్‌తోనే కత్తులు,కర్రలతో వెళ్లినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. టీడీపీకి చెందిన తోట సందీప్‌, జనసేనకు చెందిన పండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గుర్తింపు సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేశారు. దాదాపు 30 మంది ఘర్షణకు పాల్పడినట్టు గుర్తించారు.  (చంద్రబాబుపై కేసు నమోదు)

భూ వివాదంలో ఒకరు మృతి..
టీడీపీ, జనసేన మధ్య జరిగిన భూ వివాదంలో ఒకరు మృతి చెందారు. రూ.2 కోట్ల స్థలం విషయంలో చెలరేగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన సందీప్‌ చికిత్స పొందుతూ మృతిచెందారు. మరణాయుధాలతో ఇరువర్గాలు దాడులు చేసుకోగా, ఆసుపత్రిలో మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఘర్షణకు పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆరు ప్రత్యేక బృందాలను విజయవాడ సీపీ ఏర్పాటు చేశారు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
 

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top