ప్రాణం తీసిన సిగరెట్‌ వివాదం | Murder In Cigarette Fight Karnataka | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన సిగరెట్‌ వివాదం

Nov 5 2018 11:31 AM | Updated on Nov 5 2018 11:31 AM

Murder In Cigarette Fight Karnataka - Sakshi

హత్యకు గురైన మహదేవ్‌

కర్ణాటక, కృష్ణరాజపురం : సిగరెట్‌ విషయమై తలెత్తిన వివాదం యువకుడి ప్రాణం తీసింది. నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంకాం చదువుతున్న కామాక్షిపాళ్యకు చెందిన వినయ్‌ ఆదివారం విజయనగర్‌ ఫుడ్‌స్ట్రీట్‌లో సిగరెట్‌ దుకాణానికి వెళ్లి సిగరెట్‌ తీసుకున్నాడు. అనంతరం డబ్బులు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా సిగరెట్‌ దుకాణం యజమాని మహదేవ్‌ (27) వినయ్‌ని అడ్డుకొని డబ్బులు అడిగారు. ఇదే విషయమై ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో వినయ్‌ దుకాణం యజమాని మహదేవ్‌ను పొడిచాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా మార్గంమధ్యలో మహదేవ్‌ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న విజయనగర పోలీసులు నిందితుడు వినయ్‌ను అరెస్ట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement