ఫోర్జరీ సంతకాలతో సినిమా పేరు మార్చారు

Movie Name Change With Forgery Signatures Women Producer Complaint - Sakshi

మహిళా నిర్మాత ఫిర్యాదు

బంజారాహిల్స్‌: ఫోర్జరీ సంతకాలు, డాక్యుమెంట్లతో తమ సినిమా పేరు మార్చి తనకు నష్టం తీసుకొచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరు తూ ఓ మహిళా నిర్మాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిలింనగర్‌ రోడ్‌ నెం. 9లో ఉంటున్న అనురాధ ఉప్పలపాటి సత్యనారాయణ ప్రొడక్షన్స్‌ పేరుతో ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరో, హీరో యిన్లుగా ‘ఈడు జోడు’ సినిమాను ప్రారంభించింది.

అదే సమయంలో గుర్రం విజయలక్ష్మి సహ నిర్మాతగా చేరింది. ఆమెతో పాటు విశ్వనాథ్‌ అరిగెల అనే సినీ దర్శకుడితో అనురాధ నిబంధనల మేరకు ఒప్పందం కుదర్చుకుంది. అయితే గత మార్చి 30న భావన క్రియేషన్స్‌తో ఈ సినిమా పేరును మార్చి ‘జోడి’ పేరుతో గుర్రం విజయలక్ష్మి, విశ్వనాథ్‌ ప్రకటిస్తూ మీడియాకు వివరాలను అందజేశారు. ఈ కారణంగా తాను రూ.2 కోట్లు నష్టపోయానని ఫోర్జరీ సంతకాలతో సినిమా పేరు ను మార్చడమే కాకుండా బ్యానర్‌ కూడా మార్చా రని ఆమె ఆరోపించారు. ఫిర్యాదు మేరకు గుర్రం విజయలక్ష్మి, అరిగెళ్ళ విశ్వనాథ్‌పై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top