ప్రియుడితో పారిపోయేందుకు భర్తను... | Mother Of Two Kills Husband To Elope With Lover | Sakshi
Sakshi News home page

ప్రియుడితో పారిపోయేందుకు భర్తను మట్టుపెట్టి..

Jul 23 2019 10:42 AM | Updated on Jul 23 2019 11:02 AM

Mother Of Two Kills Husband To Elope With Lover - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

చండీగఢ్‌ : ప్రియుడితో పారిపోయేందుకు ఓ మహిళ భర్తను కిరాతకంగా హతమార్చిన ఘటన పంజాబ్‌లో వెలుగుచూసింది. తరన్‌తరన్‌ జిల్లాలో ఆదివారం రాత్రి నిందితురాలు తన భర్తకు విషం కలిపిన ఆహారం ఇచ్చిన అనంతరం అతను మరణించలేదనే భయంతో మెడకు తాడు బిగించి ఊపిరిఆడకుండా చేసి ప్రాణాలు తీసింది.

భర్త మరణించిన తర్వాత తన ఇద్దరు పిల్లలను తండ్రి ఇంటివద్ద విడిచిపెట్టి ప్రియుడితో పారిపోయింది. కాగా మహిళ పిల్లలు జరిగిన ఘటనను తాతకు వివరించడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. తమ తల్లి సిమ్రాన్‌ తండ్రి రాజ్‌ప్రీత్‌ను మెడకు తాడును బిగించి చంపిందని పిల్లలు జరిగిన ఘోరాన్ని కళ్లకు కట్టారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన తమ తల్లిపై కఠిన చర్యలు చేపట్టాలని వారు పోలీసులను కోరారు. నిందితురాలు సిమ్రాన్‌, ఆమె ప్రియుడు లవ్లీపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement