
మృతి చెందిన గాడి రవికుమారి
పుల్లంపేట: తన తల్లి తనకు మోటారు బైకు కొనివ్వలేదని కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. కుమారుడు మృతి చెందితే తన బతుకు వృథా అని భావించి తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాగా కుమారుడు ప్రాణా పాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన పుల్లంపేట మండలంలో చోటు చేసుకుంది. అనంతయ్యగారిపల్లె పంచాయతీలోని రాజుగారిపల్లె గ్రామానికి చెందిన గాడి రవికుమారి (50), కుమారుడు పవన్ చైతన్య కుమార్ రెడ్డి (18) జీవనం సాగిస్తున్నారు. పవన్‌కుమార్ రెడ్డి బీటెక్ మొదటిసంవత్సరం రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో చదవుతున్నాడు. తనకు మోటారు బైక్ తీసివ్వాలని తల్లిని కోరాడు. తల్లి తమ దగ్గర అంత స్థోమత లేదని చెప్పగా పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. దీంతో తల్లి కుమారుడు మృతి చెందితే తాను ఎవరికోసం బతకాలని ఇంటిలో ఉన్న వాస్మోల్ తాగి అక్కడికక్కడే మృతి చెందింది. పవన్ చైతన్యకుమార్ రెడ్డిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు.