ఓ కొడుకా.. నీ వెంటే వస్తున్నా..! | Mother Dies Of Broken Heart After Losing Her Son | Sakshi
Sakshi News home page

Apr 27 2018 6:51 AM | Updated on Apr 27 2018 6:51 AM

Mother Dies Of Broken Heart After Losing Her Son - Sakshi

దిక్కుతోచని స్థితిలో జకియా, నిజాముద్దీన్, (ఇన్‌సెట్‌) మరున్‌బీ మృతదేహం

సాక్షి, కారేపల్లి: చెట్టంత కొడుకు మరణాన్ని తట్టుకోలేని ఓ తల్లి, ‘ఓరి కొడుకా.. నీ వెంటే వస్తున్నా’నన్నట్టుగా, గుండెపోటుతో మృతిచెందింది. కారేపల్లి రైల్వే స్టేషన్‌ రోడ్డులో హోటల్‌ నిర్వహిస్తున్న షేక్‌ మరున్‌బీ(70) భర్త పదేళ్ల క్రితం మృతిచెందాడు. వీరికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఒక కుమార్తె, ఒక కుమారుడు మూగవారు. వివాహితురాలైన మరో కుమార్తె, భర్త మృతితో పుట్టింటిలోనే ఉంటోంది. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన ఓ కుమారుడు కూడా ఇంటి వద్దే ఉంటున్నాడు.

ఇంత పెద్ద కుటుంబాన్ని చిన్న కుమారుడైన ఇక్బాల్‌ పోషిస్తున్నాడు. గత నెల 31న రైలు ప్రమాదంలో ఇక్బాల్‌ మృతిచెందాడు. అప్పటినుంచి తల్లి మరున్‌బీ తీవ్ర మనోవేదనతో ఉంటోంది. ఆమె బుధవారం రాత్రి తీవ్రంగా అస్వస్థురాలైంది. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందింది. కుటుంబ పోషకుడైన సోదరుడు, తల్లి దూరమవడంతో ఆ ఇంటిలోని వారి పరిస్థితి దయనీయంగా మారింది. మూగవారైన జకియా, నిజాముద్దీన్‌ను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement