మోస్ట్‌ వాంటెడ్‌ చికెన్‌బాబా అరెస్ట్‌ | Most Wanted Chicken Baba Arrest In Hindupuram Anantapur | Sakshi
Sakshi News home page

మోస్ట్‌ వాంటెడ్‌ చికెన్‌బాబా అరెస్ట్‌

Aug 9 2018 11:35 AM | Updated on Aug 20 2018 4:27 PM

Most Wanted Chicken Baba Arrest In Hindupuram Anantapur - Sakshi

స్వాధీనం చేసుకున్న నగదు, ప్రింటర్, సెల్‌ఫోన్‌తో పోలీçసులు

అనంతపురం, హిందూపురం అర్బన్‌: మట్కా నిర్వాహణలో ఆరితేరి పోలీసుల రికార్డులో మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న చికెన్‌బాబాను బుధవారం అరెస్టుచేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను హిందూపురం వన్‌టౌన్‌ సీఐ చిన్నగోవిందు మీడియాకు వెల్లడించారు. హిందూపురం, పరిసర ప్రాంతాల్లో అత్యధికగా మట్కా లావాదేవీలు కొనసాగించే చికెన్‌బాబాను అరెస్టు చేయడానికి హిందూపురం పోలీసులే కాకుండా కర్ణాటక పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

గతంలో ఎస్పీ ఇతన్ని జిల్లా బహిష్కరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే చికెన్‌బాబా పరారీ కావడం, తర్వాత ఎస్పీ, స్థానిక పోలీసు అధికారుల బదిలీలు కావడంతో ఆ ప్రణాళిక నిలిచిపోయింది. అయితే తన అనుచరులతో మట్కాను నిరాటంకంగా సాగిస్తున్న చికెన్‌బాబాను పోలీసులు మేళాపురం వద్ద అరెస్టు చేసి రూ.2.25 లక్షల నగదు, సెల్‌ఫోన్, ప్రింటర్‌ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా గత నెల 28న బాబా ముఖ్య అనుచరుడైన మంజునాథ్‌ అలియాస్‌ బొట్టు మంజును అరెస్టు చేసి రూ.లక్షకు పైగా నగదు స్వాధీనం చేసుకోవడం, వారం తర్వాత ఇప్పడు చికెన్‌బాబా అరెస్టు కావడంతో అంతా నాటకీయంగా సాగిపోయిందన్న అభిప్రాయం  వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement