బ్యాంకు ఖాతాల్లో సొమ్ము మాయం!

Money Withdrawal Without ATM In Guntur - Sakshi

నెల వ్యవధిలోనే రూ.1.35 లక్షలు స్వాహా

పలు బ్యాంకుల లబ్ధిదారుల అవస్థలు

న్యాయం కోసం పోలీసులకు ఫిర్యాదు

గుంటూరు, పిడుగురాళ్లరూరల్‌: పల్నాడుకు ‘సైబర్‌’ సెగ తగిలింది. కాయకష్టం చేసి పేదలు దాచుకున్న సొమ్ము బ్యాంకు ఖాతాల్లోంచి మాయమవుతోం ది. బ్యాంకు సిబ్బందిని అడిగితే నిర్లక్ష్య సమాధానమే వస్తుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పట్టణంలోని బ్యాంక్‌ఆఫ్‌ ఇండియాలో 2015లో షేక్‌ హుస్సేనమ్మ ఖాతా తెరచింది. గత శుక్రవారం బ్యాంక్‌ వద్దకు వచ్చి నగదు తీసుకునేందుకు డ్రా ఫారంను పూర్తి చేసి నగదు తీసుకునేందుకు ప్రయత్నించగా అకౌంటెంట్‌ మీరు తీసుకోవాల్సిన అంత లేదని రూ. 14,920లు మాత్ర మే ఉన్నాయని చెప్పారు. ఒక్కసారిగా కంగుతిన్న హుస్సేనమ్మ  బ్యాంక్‌ మేనేజర్‌ బట్టాచార్యకు ఫిర్యాదు చేసింది. దీంతో మేనేజర్‌ ఆమె అకౌంట్‌ నంబర్‌ను సేకరించి ఆ నగదు ఎలా దారి మళ్లిం తో తెలుసుకుంటామని, మంగళవారం బ్యాంక్‌ వద్దకు రమ్మని చెప్పారు. హుస్సేనమ్మ తన తమ్ముడు సైదాతో బ్యాంక్‌ మేనేజర్‌ను కలవగా ఏటీఎం ద్వారా నగదు డ్రా చేశారని  చెప్పారు.

ఇదేలా సాధ్యం..
హుస్సేనమ్మ తనకు సంతకం చేయటం రాదని, వేలిముద్ర మాత్రమే వేస్తానని, అసతు తనకు ఏటీఎం కార్డేలేదని వాపోయింది. అకౌంట్‌లో నుంచి డబ్బులు ఎలా డ్రా అయ్యాయని బ్యాంక్‌ మేనేజర్‌ను ప్రశ్నించగా తాము ఏమీ చేయలేమని, పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టుకోమని సమాధానం చెప్పారు. ఈ క్రమంలో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 10న మండలంలోని జానపాడు గ్రామానికి చెందిన పసుపులేటి ఓబయ్య అనే వ్యక్తి అకౌంట్‌ నుంచి బ్యాంక్‌ మేనేజర్‌ పేరుతో ఫోన్‌ ద్వారా అకౌంట్, ఏటీఎం వివరాలు తెలుసుకొని రూ.95 వేలు నగదు డ్రా చేశారు. ఓబయ్య వెంటనే జానపాడు చైతన్య గోదావరి బ్యాంక్‌ మేనేజర్‌తో సహా వచ్చి ఫిర్యాదు చేశారు.  

నాకు ఏటీఎం లేదు..
నాకు చదువురాదయ్యా... కూడబెట్టుకున్న డబ్బులు బ్యాంక్‌లో దాచుకున్నాను. కానీ ఏటీఎం ద్వారా డబ్బు ఖాజేశారంటే నాకు ఎడుపే వస్తుంది. ఏమీ చేయాలో అర్థం కావటం లేదు.  నా దగ్గర ఉన్నా ఉండేయోమే. ఈ బ్యాంక్‌ వారిని నమ్మి పూర్తిగా నష్టపోయాను. నాకు న్యాయం చేయండి.– హుస్సేనమ్మ,బాధితురాలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top