వివాహితపై యువకుడి అత్యాచారం

Molestation On Woman In Chittoor - Sakshi

అకృత్యాలు సెల్‌ఫోన్‌లో     చిత్రీకరణ

బయట పెడితే చంపేస్తానని బెదిరింపు

చిత్తూరు , కార్వేటినగరం : మండలంలోని గోపిశెట్టిపల్లి దళితవాడలో వివాహితపై అత్యాచారం చేశాడో యువకుడు. రాక్షసంగా ప్రవర్తించడమే కాకుండా, బయటపెడితే చంపేస్తానని బెదిరించాడు. ఎస్‌ఐ శ్రీనివాసరావు కథనం మేరకు వివరాలిలా.. గోపిశెట్టిపల్లి దళితవాడకు చెందిన యువతి(21)కి నాలుగేళ్ల కిందట వెదురుకుప్పం మండలం బొమ్మనదొడ్డి దళితవాడకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వివాహమైన ఆరునెలలకే భర్తకు మతిస్థిమితం లేకుండా ఎటో వెళ్లిపోవడంతో ఆమె తిరిగి పుట్టింటికి చేరుకుంది. పాడిపై ఆధారపడి జీవనం సాగిస్తోంది.

ఆమెకు ప్రస్తుతం నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సదరు వివాహిత గ్రామ సమీపంలోని పళ్లిపట్టు చెరువులో పశువులను మేపుతుండగా, అదే గ్రామానికి చెందిన గరుణ కుమారుడు పి.పాండియన్‌ వెనుక నుంచి వచ్చి ఆమెను బలవంతంగా పక్కనున్న చెరుకుతోటలోకి లాక్కెళ్లాడు. అత్యాచారం చేసి ఆమె మర్మావయాలపై కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ అకృత్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఇకపై తాను పిలిచిన చోటకు రాకపోతే దృశ్యాలను వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో పెడతానని, విషయాన్ని బయటపెడితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top