మత్తుమందిచ్చి స్నేహితుడి భార్యపై

Molestation on Friend Wife in Tamil Nadu - Sakshi

నిందితుల కోసం పోలీసుల గాలింపు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

చెన్నై, టీ.నగర్‌: ఆలయ ఉత్సవంలో కేసరి తోపాటు మత్తు చాక్లెట్‌ ఇచ్చి స్నేహితుని భార్యను నగ్నంగా వీడియో తీయడంతో పాటు సామూహిక అత్యాచారం జరిపిన ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చెన్నై విరుగంబాక్కం గాంధినగర్‌ ప్రాంతానికి చెందిన మహిళ (26). ఈమె భర్త వడ్రంగి. మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్యగా బాధితురాలిని వివాహం చేసుకున్నాడు. ఇలావుండగా మహిళ భర్త వడ్రంగి పనిపై గత జూలై నెలలో పొరుగూరికి వెళ్లి రెండు నెలల తర్వాత ఇంటికి వచ్చాడు.

ఆ సమయంలో భార్య మెడలోని మూడు సవర్ల బంగారు నగ కనిపించనందున ప్రశ్నించాడు. అందుకామె మీ స్నేహితుడు వినోద్‌కుమార్‌ (30), హరీష్‌కుమార్‌ మీరు ఊరెళ్లిన సమయంలో ప్రసాదం అంటూ మత్తుమందిచ్చి తనపై అత్యాచారం జరిపి మూడు సవర్ల బంగారు నగ అపహరించినట్లు తెలిపింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన భర్త, భార్యతో కలిసి దీనిపై బుధవారం టీ.నగర్‌ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వినోద్‌కుమార్, సతీష్‌కుమార్‌పై కేసు నమోదు చేసి ఇరువురి కోసం గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top