తల, మొండెం వేరు చేసి.. గోనె సంచిలో కుక్కి | Miscreants killed brutally | Sakshi
Sakshi News home page

తల, మొండెం వేరు చేసి.. గోనె సంచిలో కుక్కి

Mar 10 2018 2:13 AM | Updated on Sep 29 2018 5:10 PM

Miscreants killed brutally - Sakshi

భైంసా: ఎక్కడో హత్య చేసి.. వేరు చేసిన తల, మొండాన్ని గోనె సంచిలో కుక్కిన దుండగులు శుక్రవారం నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణం నరసింహనగర్‌ రోడ్డు లోని డ్రైనేజీలో పడేశారు. ఉదయం డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వచ్చిన పారిశుధ్య సిబ్బంది సంచిని బయటకు తీయగా తల రాలి కిందపడింది.

భయ కంపితులైన వారు పోలీసులకు సమాచారం అందించగా, డీఎస్పీ అందె రాములు ఘటనాస్థలానికి చేరుకుని పోలీసు జాగిలాలతో తనిఖీ చేయించారు. మృతుడి తలను భైంసాలోని ఏరియ ఆస్పత్రిలో భద్రపరిచారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement