
బంగారు అభరణాలు, నగదు చూపిస్తున్న డీఐ రమేష్
మలక్‌పేట: కారుపై కోరికతో ఓ మైనర్ బాలుడు తన బంధువుల ఇంట్లో చోరీ చేశాడు.ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. డీఐ గుజ్జ రమేష్ తెలిపిన మేరకు..కర్ర సత్యనారాయణ కుటుంబంతో కలిసి సలీంనగర్‌లోని ప్రణవ అపార్ట్‌మెంట్‌లో 302 ఫ్లాంట్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 3 తేదిన భార్య భర్తలు ఉద్యోగాలకు వెళ్లగా పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం 8 గంటలకు అందరూ ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంట్లో ఉన్న 16 తులాల బంగారు నగలు,రూ.38 వేలు నగదు కన్పించలేదు.
ఇంటికి వేసినా తాళాలు, బీరువా తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న బాధితుని బంధువు కుమారుడు (17) నిందితుడిగా తేలింది.అతను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కారు కొనుకోవాలనే ఆశతో మైనర్‌బాలుడు ఓ పథకం ప్రకారం చోరీ చేశాడు. బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించి, బంగారు అభరణాలు, 25 వేలు నగదు రీకవరీ చేసినట్లు డీఐ తెలిపారు. సమావేశంలో డీఎస్సై శివశంకర్, సిబ్బంది పాల్గొన్నారు.