
ప్రతీకాత్మక చిత్రం
భార్య కోసం ఇద్దరు భర్తల మధ్య జరిగిన గొడవ మొదటి భర్త హత్యకు దారితీసిన ఘటన దేవరజీవనహళ్లి (డీజే) వద్ద కావలభైరసంద్రలో చోటు చేసుకుంది.
కర్ణాటక, శివాజీనగర : భార్య కోసం ఇద్దరు భర్తల మధ్య జరిగిన గొడవ మొదటి భర్త హత్యకు దారితీసిన ఘటన దేవరజీవనహళ్లి (డీజే) వద్ద కావలభైరసంద్రలో చోటు చేసుకుంది. కావలభైరసంద్రకు చెందిన ఇర్ఫాన్ (30)ను హత్య చేసిన ఆటో డ్రైవర్ తౌసిఫ్‌ను డీజే.హళ్లి పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ ఎస్.డీ.శరణప్ప తెలిపారు. మాంసం విక్రయించే ఇర్ఫాన్ నాలుగు సంవత్సరాల క్రితం ఇలోపర్ భానును వివాహం చేసుకున్నాడు. మద్యం వ్యవసనం ఉన్న ఇర్ఫాన్ భార్యతో తరుచూ గొడవపడుతూ వేధించేవాడు.
దీంతో విసుగెత్తిన ఇలోపర్ భాను ఇర్ఫాన్‌ను విడచిపెట్టి కొన్ని నెలల క్రితం ఆటో డ్రైవర్‌గా ఉన్న తౌసిఫ్ ను వివాహం చేసుకుంది. అయినా ఆమెను విడచిపెట్టకుండా మాజీ భర్త ఇర్ఫాన్ అప్పుడప్పుడు భార్య ఇంటికి వెళ్లి గొడవపడుతుండేవారు. పలుసార్లు ఇలోపర్ భాను, తౌసిఫ్ నచ్చచెప్పినా కూడా ఇర్ఫాన్ తన వైఖరిని మార్చుకోలేదు. తాగిన మత్తులో బుధవారం రాత్రి తన భార్య, ఆమె రెండో భర్త ఉన్నపుడు వెళ్లి గొడవపడ్డాడు. దీంతో ఆవేశానికి గురైన తౌసిఫ్ మొదటి భర్త ఇర్ఫాన్ రొమ్ముపై చాకుతో పొడచి హత్య చేశాడు. సమాచారం తెలియగానే తక్షణమే స్థలానికి చేరుకున్న డీజే.హళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడు తౌసిఫ్‌ను అరెస్టు చేశారు.