హత్య చేసి.. తగలబెట్టి..

Married Woman Murdered In Guntur District - Sakshi

వివాహితపై కిరాతకం

శ్మశానంలో మృతదేహం

సాక్షి, శావల్యాపురం: మండలంలోని పోట్లూరు గ్రామం హిందూ శ్మశానవాటికలో యువతిని హత్య చేసి అనంతరం అత్యంత కిరాతంగా పెట్రోలు పోసి కాలి్చవేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలి వయస్సు 25 సంవత్సరాలు ఉంటుంది. కాలి వేళ్లకు మెట్టెలు, ఎడమ చేతికి రాగి ఉంగరం, గడులు కల్గిన పంజాబీ డ్రస్‌ వేసుకుంది. శ్మశానం వైపు పొలాలు ఉన్న రైతులు కాలుతున్న మృతదేహం చూసి చుట్టుపక్కల వారికి సమాచారం తెలిపారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ కె.వీరారెడ్డి పరిశీలించి విలేకర్లతో మాట్లాడారు.

యువతిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి తగలబెట్టినట్లు చెప్పారు. కేసు విచారణ చేసి త్వరలోనే ఛేదిస్తామన్నారు. శ్మశానవాటిక సమీపాన మృతదేహాన్ని చున్నితో ఈడ్చుకుంటూ వెళ్లిన గుర్తులు కనిపించినట్లు తెలిపారు. తెల్లవారుజామున జరిగిన ఘటనగా భావిస్తున్నామని పేర్కొన్నారు. తెలిసిన వారే హత్య చేసి ఇటువంటి దురాగతానికి పాల్పడినట్లు  తెలిపారు. యువతి హత్య కేసు వ్యవహారం స్థానికంగా కలకల రేపింది. వినుకొండ రూరల్‌ సీఐ యం.సుబ్బారావు, ఎస్సై కత్తి స్వర్ణలత, తహసీల్దారు కె.సుజాత, ఆర్‌ఐ బాలవెంకటేశ్, వీఆర్వో వెంకటరావు, ఏఎస్సై మహమ్మద్‌అలీ, ఎస్‌బీ అధికారి శ్రీనివాసరావు తదితరులున్నారు. వీఆర్వో పిర్యాదు మేరకు కేసును ఎస్సై నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేస్తున్నారు. సగం కాలిపోయిన మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top