క్షణికావేశం.. విషాదంతం | Married Couple Commits Suicide Attempt in Guntur | Sakshi
Sakshi News home page

క్షణికావేశం.. విషాదంతం

Feb 28 2020 1:23 PM | Updated on Feb 28 2020 1:23 PM

Married Couple Commits Suicide Attempt in Guntur - Sakshi

మృతురాలు దుర్గాభవాని

రెంటచింతల(మాచర్ల): క్షణికావేశంలో భార్యాభర్తలు తీసుకున్న నిర్ణయంతో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైపోయింది. మున్నంగి నర్సింహారెడ్డి, దుర్గాభవాని దంపతులు మండల కేంద్రమైన రెంటచింతల గంధంవారి బజారు సమీపంలో నివసిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బుధవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు వారిని రెంటచింతల ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. భార్య దుర్గాభవాని (38) చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త నర్సింహారెడ్డి పరిస్థితి విషమించడంతో వెంటనే నర్సరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నర్సింహా రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె అంజలికి వివాహమైంది. చిన్న కుమార్తె స్రవంతి స్థానిక వైఆర్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మృతురాలు దుర్గాభవాని తల్లి బిక్కిరెడ్డి విజయ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చల్లా సురేష్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement