మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులు.. నటుడి అరెస్ట్‌

Marathi TV Actor Arrested For Molesting a Girl In Pune - Sakshi

పుణె : మైనర్‌ బాలికను లైంగికంగా వేధించిన నటుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఫోటో షూట్‌ పేరుతో బాలికను ఇంటికి పిలిచి లైంగికంగా వేధించిన ఘటన పుణెలో చోటు చేసుకుంది. బాలిక ఫిర్యాదుతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 35 ఏళ్ల మందార్‌ కులకర్ని మరాఠీలోని పలు టీవీ షోలలో నటిస్తుంటాడు. బాధిత బాలిక ఆరు నెలల క్రితం అతడిని పుణెలోని యాక్టింగ్‌ స్కూల్‌ కలిశానని తెలిపింది. ఈ పరిచయం కొద్ది మందార్‌ సదరు బాలికకు ఓరోజు ఫోన్‌ చేసి టీవీ షోకి అడిషన్స్‌ జరుగుతున్నాయని.. ఫొటోలు కావాలని చెప్పాడు. అందుకోసం ఆమెను ఫొటో షూట్‌ చేయాలని.. తానే ఉచితంగా ఫోటో షూట్‌ చేస్తానని చెప్పి తన ఇంటికి రావాల్సిందిగా బాలికను ఒప్పించాడు.

వివిధ రకాల దుస్తులతో తన ఫొటోలు తీశాడని, ఆ తర్వాత బికినిలో కూడా ఫొటోలు కావాలని అడిగాడని బాలిక తెలిపింది. బికినిలో ఫొటోలు తీస్తున్న సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక ఆరోపించింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయం గూర్చి తన తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వెంటనే వారు బాలికను తీసుకుని సమీప పోలీస్‌ స్టేషన్‌లో నటుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ అంశంపై విచారణ జరపగా.. నిందితుడు తన సెల్‌ఫోన్‌లో కూడా బాలిక ఫొటోలు చిత్రీకరించినట్లు తేలింది. దీంతో పోలీసులు అతడిపై ఐపీసీ సెక‌్షన్‌ 354 , పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి అతడి నుంచి సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top