మావోయిస్టు దళ సభ్యురాలి అరెస్టు

Maoist Member Arrest in Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ జిల్లా  పోలీసులు సీపీఐ మావోయిస్టు పార్టీకి  చెందిన, మావోయిస్టు అనుబంధ సంఘాలలో పని చేస్తున్న  ఆత్మకూరు అనూషను పెదబయలు  పోలీస్‌ స్టేషన్‌ కేసులలో అరెస్టు చేశారు. ఈ మేరకు పాడేరు డీఎస్పీ పి.బి.రాజ్‌కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేసారు.  పాత కేసులలో అరెస్టు కాబడి ఈరోజు బెయిల్‌పై  విశాఖపట్నం సెంట్రల్‌  జైలు నుండి విడుదలకాగా, పాడేరు పోలీసులు ఇతర కేసుల నిమిత్తం అరెస్టు చేసి స్పెషల్‌ ఏజేఎఫ్‌సీఎం కోర్టుకు  తరలించగా  ఈనెల 20 వరకు కోర్టు రిమాండ్‌  విధించింది.

ఆత్మకూరు అనూష(24) తండ్రి రమణయ్య  చైతన్య  మహిళా సంఘంలో పనిచేస్తూ , సీపీఐ మావోయిస్టు పార్టీలో దళ మెంబర్‌గా  కొనసాగుతోంది.  ఈమెకు పెదబయలుపోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు కేసులతో సంబంధం ఉన్నట్టు  విచారణలో తేలినందున  అరెస్టు చేసినట్టు సమాచారం. గత ఏడాది ఏప్రి ల్‌ నెలలో  ఈమె సీపీఐ మావోయిస్టులు అక్కిరాజు హరగోపాల్,ఉదయ్, చలపతి మరికొంత మంది మావోయిస్టు సభ్యులు  గ్రామంలో స్థానిక గిరిజనులుతో  బెదిరించి  బలవంతంగా ప్రజాకోర్టు  నిర్వహించారు. అలాగే జుండాం అటవీ ప్రాంతంలో  పోలీసులు వస్తున్నారని  ముందస్తు సమాచారంతో మందుపాత్రలు అమర్చిన సంఘటనలో మావోయిస్టులతో కలిసిప్రత్యక్షంగా పాల్గొంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top