పనికోసం వెళితే దొంగ అనుకుని.. | Man Lynched On Suspicion Of Being Thief | Sakshi
Sakshi News home page

పనికోసం వెళితే దొంగ అనుకుని..

Aug 12 2018 7:16 PM | Updated on Aug 12 2018 8:12 PM

Man Lynched On Suspicion Of Being Thief - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యూపీలో మూక హత్య కలకలం..

లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. దొంగ అనే అనుమానంతో ముజఫర్‌నగర్‌లోని బీజోపూర్‌లో కపిల్‌ త్యాగి అనే వ్యక్తిని స్ధానికులు చితకబాదడంతో మరణించాడు. పోస్ట్‌మార్టం నివేదికలో బాధితుడి శరీరంపై 11 గాయాలున్నట్టు గుర్తించామని చాపర్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సుభాష్‌ రాధోడ్‌ తెలిపారు. బాధితుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని, ఈ ఘటనపై దర్యాప్తుం చేస్తున్నామని చెప్పారు.

త్యాగిని చావబాదిన దుండగుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారికోసం గాలిస్తున్నామని చెప్పారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. త్యాగి అమాయకుడని, పని కోసం బీజోపూర్‌ వెళ్లగా స్ధానికులు అతడిని చితకబాదారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement