తన భార్య వెంట పడొద్దన్నందుకు.. | Man Harassing Neighbors Wife And Attack on Her Husband | Sakshi
Sakshi News home page

వేధింపులు మానుకోవాలన్నందుకు..

Oct 1 2019 10:52 AM | Updated on Oct 1 2019 10:52 AM

Man Harassing Neighbors Wife And Attack on Her Husband - Sakshi

తన భార్యను వెంబడిస్తూ వేధింపులకు గురిచేస్తున్న ఓ వ్యక్తి తీరు మార్చుకోవాలని మందలించేందుకు అతని ఇంటికి వెళ్ళగా సదరు వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేసిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

కేపీహెచ్‌బీకాలనీ: తన భార్యను వెంబడిస్తూ వేధింపులకు గురిచేస్తున్న ఓ వ్యక్తి తీరు మార్చుకోవాలని మందలించేందుకు అతని ఇంటికి వెళ్ళగా సదరు వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేసిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్‌బీకాలనీ, లోథా బెల్లెజలో ఉంటున్న విజయ్‌కుమార్‌ భార్యను  అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సాయిరాజ్‌ అనేవ్యక్తి వెంబడించడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నాడు.

బాధితురాలు ఈ విషయాన్ని భర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో విజయ్‌కుమార్‌ ఆదివారం సాయంత్రం  సాయిరాజ్‌ను మందలించేందుకు అతడి ఇంటికి వెళ్ళాడు. సాయిరాజ్‌ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పి అతని ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడు. అదే సమయంలో ఇంట్లోనే ఉన్న సాయిరాజ్‌ ఇనుపరాడ్డుతో విజయ్‌కుమార్‌పై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement