ప్రేమించాలని వేధింపులు.. కాదనడంతో దారుణం ..!! | Man Harassing Minor Girl And Set On Fire In Kurnool | Sakshi
Sakshi News home page

ప్రేమించాలని వేధింపులు.. కాదనడంతో దారుణం ..!!

Jan 27 2019 11:31 AM | Updated on Jan 27 2019 12:43 PM

Man Harassing Minor Girl And Set On Fire In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : కౌతాళం మండలం బదినేహల్‌లో దారుణం చోటుచేసుకుంది. పన్నెండేళ్ల బాలికపై ఓ కామాంధుడు హత్యాయత్నం చేశాడు. వివరాలు.. గ్రామానికి చెందిన బాలికను మౌలానా సాహెబ్‌ అనే వ్యక్తి తనను ప్రేమించాలని గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో శుక్రవారం అర్ధరాత్రి నిప్పటించాడు. బాలిక కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు మంటలార్పి ఆమెను ఆదోని ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై నిర్భయ, హత్యాయత్నం కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement