10 నిమిషాలు లేట్‌గా వచ్చినందుకు విడాకులు..

UP Man Gives Triple Talaq Over Phone To Wife Over 10 minutes Late - Sakshi

లక్నో : ట్రిపుల్‌ తలాక్‌ నేరం అంటూ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినప్పటికి ఇలాంటి సంఘటనలు మాత్రం ఆగడం లేదు. భార్య 10 నిమిషాలు ఇంటికి ఆలస్యంగా వచ్చిందని చెప్పి ఫోన్‌లోనే విడాకులిచ్చాడు ఓ ప్రబుద్ధుడు. యూపీలో జరిగింది ఈ సంఘటన. వివరాలు.. బాధితురాలు జబ్బుచేసి ఉన్న తన నానమ్మను చూడ్డానికి పుట్టింటికి వెళ్లింది. వెళ్లే ముందు భర్త సరిగా అర్ధగంటలో ఇంట్లో ఉండాలని హెచ్చరించాడు. అయితే భర్త చెప్పిన టైం కాన్న ఓ పది నిమిషాలు ఆలస్యంగా ఇంటికి వచ్చింది బాధితురాలు.

దాంతో బాధితురాలి భర్త ఆమె సోదరునికి ఫోన్‌ చేసి మూడుసార్లు తలాక్‌ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. భర్త నిర్వకం తెలుసుకున్న బాధితురాలు తన కుటుంబసభ్యులను తీసుకుని అత్తారింటికి వస్తే ఆమె మీద దాడి చేసి ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో బాధితురాలు తన భర్త, అతని కుటుంబసభ్యుల మీద పోలీస్ కేసు పెట్టింది. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బాధితురాలు మాట్లాడుతూ.. తనకు న్యాయం చేయాలని లేకపోతే.. ఆత్మహత్యే దిక్కని బాధపడుతుంది. అంతేకాక పెళ్లైన నాటి నుంచి అత్తింటివారు తనను కట్నం కోసం వేధిస్తున్నారని తెలిపింది. తన తల్లిదండ్రులు చాలా పేదవారిని కట్నం ఇచ్చుకోలేరని చెప్పినా వినిపించుకోవడం లేదని వాపోయింది. కట్నం కోసం తనను కొట్టడమే కాక.. ఇప్పటికే ఒక సారి ఆబార్షన్‌ కూడా చేయించారని తెలిపింది. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top