ప్రాణం తీసిన పాటల మోజు | Man died by electric shock | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన పాటల మోజు

May 3 2018 9:15 AM | Updated on Sep 5 2018 2:26 PM

Man died by electric shock - Sakshi

శ్రీనివాస్‌ మృతదేహం 

పుల్‌కల్‌(అందోల్‌) : చార్జింగ్‌ అవుతున్న సెల్‌కు ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకొని పాటలు వింటూ నిద్రపోయిన యువకుడు షార్ట్‌ సర్క్యూట్‌తో దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్‌కల్‌ మండలంలోని సింగూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రసాద్‌రావు కథనం ప్రకారం సింగూర్‌ గ్రామానికి చెందిన పోతగోని శ్రీనివాస్‌ (30) మంగళవారం రాత్రి తన సెల్‌ ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టాడు.

చార్జింగ్‌ అవుతున్న సెల్‌కు ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకొని పాటలు వింటూ నిద్రపోయాడు. ఈ క్రమంలో చార్జింగ్‌ అవుతున్న సెల్‌ ద్వారా షార్ట్‌ సర్క్యూటై ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకొని పాటలు వింటున్న శ్రీనివాస్‌ మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జోగిపేట ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement