హెల్మెట్‌ ధరించనిది ఆ.. ఒక్కరోజే | Man Died In Car Accident Chittoor | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ ధరించనిది ఆ.. ఒక్కరోజే

Nov 7 2018 1:14 PM | Updated on Nov 7 2018 1:14 PM

Man Died In Car Accident Chittoor - Sakshi

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్న గుర్రప్ప

చిత్తూరు, వరదయ్యపాళెం: సైకిల్‌ ప్రయాణంలోనూ హెల్మెట్‌ ధరించి ఆదర్శంగా నిలిచిన ఆ వ్యక్తి విధి ఆడిన వింత నాటకంలో మృత్యువాత పడ్డాడు. వరదయ్యపాళెం ఉబ్బలమడుగు రోడ్డు మార్గంలో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందారు. పోలీసులకు అందిన సమాచారం మేర కు వివరాలు ఇలా ఉన్నాయి. బుచ్చినాయుడుకండ్రిగ మండలానికి చెందిన చిన్న గుర్రప్ప (59) సమీపంలోని అవంతి తోళ్ల పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అయితే నెలసరి వేతనం కోసం మంగళవా రం అవంతి పరిశ్రమకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన ఇన్నోవా కారు ఢీకొనడంతో చిన్న గుర్రప్ప తలకు బలమైన గాయం తగిలింది. దీంతో చికిత్స నిమిత్తం ఆయనను శ్రీసిటీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఎస్‌ఐ హరిప్రసాద్‌ í ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.  డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నామన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ.. సైకిల్‌ ప్రయాణంలోనూ హెల్మెట్‌ ధరించే గుర్రప్ప ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్‌ వాడకపోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement