వ్యక్తి మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన | A Man Died And His Relatives Protest Before Hospital | Sakshi
Sakshi News home page

వ్యక్తి మృతి.. ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన

Jun 13 2019 11:50 AM | Updated on Jun 13 2019 11:51 AM

A Man Died And His Relatives Protest Before Hospital - Sakshi

సాక్షి, విజయవాడ: ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఓ వ్యక్తి మృతి చెందాడని అతడి బందువులు ఆందోళనకు దిగారు. వివరాలు.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వరప్రసాద్‌ అనే యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కరెంట్‌ పోయినా జనరేటర్‌ వేయకపోవడం వల్లే వెంటిలేటర్‌ పనిచేయలేదని, అందువల్లే మృతి చెందాడని బంధువుల ఆరోపించారు. నర్సులు, జూనియర్‌ డాక్టర్లే వైద్యం చేశారని, సీనియర్‌ వైద్యులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి విషమించడం వల్లే మృతి చెందాడని, ఆస్పత్రి నిర్లక్ష్యం వహించలేదంటూ సూపరింటెండెంట్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement