
పెళ్లి కావడం లేదని మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
సనత్‌నగర్: పెళ్లి కావడం లేదని మనస్తాపానికిలోనైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.బోరబండ శివాజీనగర్‌కు చెందిన హరికృష్ణ ( 32) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్ని నెలలుగా కుటుంబసభ్యులు అతడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నా కుదరడం లేదు. దీంతో అతను మనస్తాపానికి లోనయ్యాడు. బుధవారం ఇంటి నుంచి బయటికి వెళ్లిన హరికృష్ణ తిరిగి రాకపోవడంతో అతని సోదరుడు శ్రీనివాస్‌చారి గాలింపు చేపట్టగా వారు కొత్తగా నిర్మిస్తున్న ఇంటి వద్ద అపస్మారక స్థితిలో ఉన్న హరికృష్ణను గుర్తించి స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.