హీరోయిన్‌ చాన్స్‌ ఇస్తానని కారులో.. | Man Cheated Women Engineer In Tamil Nadu | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ చాన్స్‌ ఇస్తానని మోసం

Oct 25 2018 10:54 AM | Updated on Oct 25 2018 11:14 PM

Man Cheated Women Engineer In Tamil Nadu - Sakshi

గదిని అద్దెకు తీసుకుని ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు.

చెన్నై , పెరంబూరు: సినీ నిర్మాతనంటూ ఒక ఇంజినీరింగ్‌ యువతికి హీరోయిన్‌ ఆశ చూపి మోసం చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. తిరు పోరూర్, ఓల్డ్‌ మహాబలిపురానికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని(25) భవన నిర్మాణం సంస్థలో సలహాదారిణిగా పనిచేస్తోంది. ఈమె గత 8న ఉదయం తిరుప్పోరూర్‌ నుంచి సెమ్మంజేరికి వెళ్లడానికి ఆ ప్రాంతంలోని బస్టాప్‌లో నిలబడింది. ఆ సమయంలో అటుగా ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి దిగి ఆమెతో తాను సినీనిర్మాతగా పరిచయం చేసుకున్నాడు. హీరోయిన్‌ కోసం వెతుకుతున్నానని చెప్పి.. హీరోయిన్‌గా నటిస్తారా? అని అడిగాడు. అందుకు ఆ యువతి ఒప్పుకుంది. అతను మాట్లాడదామని ఆ యువతిని కారులో మహాబలిపురానికి తీసుకెళ్లాడు.

అక్కడ ఒక గదిని అద్దెకు తీసుకుని కథా చర్చలంటూ ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. అనంతరం ఆ వ్యక్తి 17వ తేదీన మళ్లీ కలుద్దామని, అప్పుడు డబ్బుతో రావాలని చెప్పాడు. అమె కూడా ఈ నెల 17న రూ.60 వేలు తీసుకుని అతన్ని కలిసింది. ఇద్దరూ కలిసి కారులో కోవైకు వెళ్లి సన్నిహితంగా మెలిగారు. అప్పుడు ఆ యువతి సినిమా చాన్స్‌ గురించి అతన్ని అడిగింది. దీంతో అతను ఆ ఆయువతిని అక్కడే వదిలి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన ఆ యువతి ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన తల్లికి చెప్పింది. ఫిర్యాదు మేరకు సెమ్మంజేరి పోలీసుల కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement