వ్యక్తి దారుణ హత్య | Man Brutally Murdered In Hyderabad | Sakshi
Sakshi News home page

వ్యక్తి దారుణ హత్య

Jan 16 2020 8:00 AM | Updated on Jan 16 2020 8:01 AM

Man Brutally Murdered In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని దుండిగల్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన యాదగౌడ్‌ను ఆసిఫ్‌ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. ఫుల్‌గా మద్యం తాగించి, అనంతరం కత్తితో దాడి చేశాడు. మద్యం మత్తులోనే ఆసిఫ్‌ కత్తిచూపిస్తూ హల్‌చల్‌ చేశాడని స్థానికులు చెబుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement