కోచింగ్‌ సెంటర్‌ వద్ద వికృత చేష్టలు | Man Arrested for Flash Private Part to Girls in Bhind MP | Sakshi
Sakshi News home page

May 6 2018 1:47 PM | Updated on Oct 8 2018 3:28 PM

Man Arrested for Flash Private Part to Girls in Bhind MP - Sakshi

భోపాల్‌: అమ్మాయిల కోచింగ్‌ సెంటర్‌ వద్ద వికృత చేష్టలకు పాల్పడ్డ కామాంధుడికి యువతులంతా తగిన బుద్ధిచెప్పారు. చిత్తుగా బాది పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.  మధ్యప్రదేశ్‌లోని భిండ్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న అమ్మాయిల కోచింగ్‌ సెంటర్‌ వద్దకు ముసుగు ధరించిన ఓ యువకుడు బైక్‌ మీద వచ్చాడు. ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ అమ్మాయిల ఎదుట  ప్యాంట్‌ విప్పి అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు.

మరుసటి రోజు అక్కడికొచ్చి అదే పని చేసేందుకు యత్నించాడు. చిర్రెత్తుకొచ్చిన అమ్మాయిలు అతన్ని దొరకబుచ్చున్నారు. స్థానికుల సాయంతో చితకబాది పోలీసులకు అప్పగించారు. అక్కడి సీసీఫుటేజీలో ఆ ఘటనంతా రికార్డయ్యింది. గతంలో బెంగళూరు సంగలి రాయన్న పార్క్‌ వద్ద ఇలాంటి తరహా ఘటనే ఒకటి చోటు చేసుకోగా.. మహిళలు తన్ని అతన్ని పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement