కేసీఆర్‌ కుటుంబంపై అభ్యంతరకర పోస్టులు  | Man Arrested For Allegedly Posting Abusive Comments Against KCR Family | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కుటుంబ సభ్యులపై అభ్యంతరకర పోస్టులు 

May 1 2019 8:30 AM | Updated on May 1 2019 11:33 AM

Man Arrested For Allegedly Posting Abusive Comments Against KCR Family - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎంపీ కవితపై ఫేస్‌బుక్‌లో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ పోస్టులు చేసిన మహబూబ్‌నగర్‌ వాసి చిర్ప నరేశ్‌ను నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై  అభ్యంతరకరంగా మార్ఫింగ్‌ చేస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు చేస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌ నేత జి.శ్రీనివాస్‌ యాదవ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు. టెక్నికల్‌ డాటా ఆధారంగా నిందితుడు మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలానికి చెందిన చిర్ప నరేశ్‌ (ప్రైవేట్‌ఉద్యోగి)గా గుర్తించారు. ఇన్‌స్పెక్టర్లు ఎన్‌.మోహన్‌రావు, ఎస్‌.మదన్, పోలీసు కానిస్టేబుల్‌చారి నేతృత్వంలోని బృందం నిందితుడు నరేశ్‌ను పట్టుకొని సిటీకి తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement