బస్సులో యువకుడికి దేహశుద్ధి | Man Arrest In Assult On Women In Bus Hyderabad | Sakshi
Sakshi News home page

బస్సులో యువకుడికి దేహశుద్ధి

Sep 13 2018 8:53 AM | Updated on Sep 13 2018 8:53 AM

Man Arrest In Assult On Women In Bus Hyderabad - Sakshi

నిందితుడు జోసఫ్‌

పంజగుట్ట: ఆర్టీసీ బస్సులో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి ప్రయాణికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.  పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాణిగంజ్‌ డిపోకు చెందిన 49ఎం బస్సులో బుధవారం ఉదయం ఓ మహిళ ప్యాట్నీ నుంచి పంజగుట్టకు వస్తుండగా ఆమె పక్కనే కూర్చున్న తాడ్‌బండ్‌కు చెందిన జోసఫ్‌ (34) అనే యువకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు తోటి ప్రయాణికులతో కలిసి జోసఫ్‌ను చితకబాది పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement