
ముంబై: మద్యం బ్రాండ్లకు మహిళల పేర్లు పెడితే అమ్మకాలు భారీగా పెరుగుతాయని మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ వ్యాఖ్యానించారు. గత శనివారం మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఓ చెక్కర మిల్లులో జరిగిన కార్యక్రమంలో గిరీశ్ మాట్లాడారు. ‘మద్యం లేదా ఇతర ఉత్పత్తుల విక్రయాలు పెరగాలంటే మహిళల పేర్లు పెట్టండి. ఇక చూసుకోండి డిమాండ్ ఎలా ఉంటుందో’ అని అన్నారు. సంబంధిత వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవడంతో విషయం బయటికొచ్చింది. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో గిరీశ్ వెంటనే క్షమాపణలు కోరారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై చందుర్బార్ జిల్లా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మరోవైపు మంత్రి గిరీశ్‌ను ఆహ్వానించిన సదరు చెక్కర మిల్లు యాజమాన్యం ‘మహారాజ’ పేరుతో మద్యం ఉత్పత్తులను విక్రయిస్తోంది.