ప్రేమికుల ప్రాణం తీసిన మనస్పర్థలు | Lovers Committed Suicide Over Disputes In Rangareddy | Sakshi
Sakshi News home page

ప్రేమికుల ప్రాణం తీసిన మనస్పర్థలు

Sep 17 2018 12:23 PM | Updated on Sep 17 2018 2:09 PM

Lovers Committed Suicide Over Disputes In Rangareddy - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఆవేదనకు గురైన యల్లాశ్‌ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న లావణ్య..

సాక్షి, రంగారెడ్డి : మనస్పర్థలు ఓ రెండు నిండు ప్రాణాలను బలికొన్నాయి. రంగారెడ్డి జిల్లాలో మనస్పర్థల కారణంగా ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని టంగుటూరు గ్రామానికి చెందిన యల్లాశ్‌(22) లావణ్య(19) గత కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. ఆ చిన్న చిన్న గొడవలు కాస్తా మనస్పర్ధలకు దారి తీశాయి. దీంతో ఆవేదనకు గురైన యల్లాశ్‌ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న లావణ్య ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో తీవ్రగాయాలపాలైన లావణ్య మృత్యువాత పడింది. పోలీసులు పోస్టుమార్టం కోసం వారి శవాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement