ప్రేమ విఫలమై బాలుడి ఆత్మహత్యాయత్నం | Love Failure Boy Commits Suicide Attempt in Guntur | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై బాలుడి ఆత్మహత్యాయత్నం

Jan 5 2019 1:17 PM | Updated on Jul 12 2019 3:02 PM

Love Failure Boy Commits Suicide Attempt in Guntur - Sakshi

గుంటూరు, వినుకొండటౌన్‌: పాఠశాలలు, కళాశాలల్లో అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రేమికుల ఆత్మహత్యాయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మసీదు మాన్యంలో నివాసం ఉంటున్న ఓ మైనర్‌ బాలుడు, మైనర్‌ బాలికను ప్రేమించాడు. సెల్‌ఫోన్‌లో పరిచయమైన వారు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆనోటా ఈనోటా ఆ విషయం పెద్దల దృషికి చేరింది. ఇద్దరూ మైనర్లు కావడంతో కొంతకాలం వేచి ఉన్న తర్వాత వివాహం చేస్తామని పెద్దలు నచ్చచెప్పినట్లు తెలిసింది. దీనికి నిరాకరించిన ప్రేమికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు, ప్రేమికుని బంధువులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాణాపాయం లేదని బంధువులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement