ఒంటరి యువతిని ఇంట్లో బంధించి.. | A lady died while takes to hospital in yadadri | Sakshi
Sakshi News home page

ఒంటరి యువతిని ఇంట్లో బంధించి..

Oct 8 2017 10:39 PM | Updated on Oct 8 2017 10:39 PM

సాక్షి, యాదాద్రి : యాదాద్రి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని ఇంట్లో బంధించి పురుగుల మందు తాగించడంతో ఆమె మృతిచెందింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారంలో ఓ ఇంట్లోకి కొందరు గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని బంధించారు. అంతటితో ఆగని ఆ దుండగులు యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించి అక్కడినుంచి పరారైనట్లు సమాచారం. ఇది గమనించిన స్థానికులు యువతిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆమె మృతిచెందినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement