రూ. 50 వేలు, లక్ష.. 2.5 లక్షలు | Sakshi
Sakshi News home page

అతన్ని పట్టిస్తే రూ. 2.5 లక్షలు నగదు బహుమతి

Published Mon, Jul 6 2020 2:53 PM

Kanpur Encounter : Rewards On Vikas Dubey Increased - Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే‌ తలపై పెట్టిన నగదు బహుమతిని మరోసారి పెంచారు. వికాస్ దూబే ప‌ట్టిస్తే రూ.2.5 ల‌క్ష‌లు బహుమతి ఇస్తామ‌ని యూపీ పోలీసులు ప్ర‌క‌టించారు. వికాస్ దూబేను అతని అనుచరులను పట్టిస్తే 50వేల నగదు బహుమతి ఇస్తామని ఇంతకు ముందు యూపీ పోలీసులు ప్రకటించారు. కానీ వికాస్ దూబే జాడ దోరక్కపోవడంతో నగదు బహుమతిని రూ. లక్షకు పెంచారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ నగదు బహుమతి ఏకంగా 2.5లక్షలు పెంచినట్లు సోమవారం ఉత్తరప్రదేశ్‌ డీజీపీ  హెచ్‌సీ అవస్థీ వెల్లడించారు. (చదవండి : ఉత్తరప్రదేశ్‌లో ఘోరం)

 భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చెక్ పోస్ట్ వద్ద దూబే ఫోటోను ఉంచామన్నారు. అతని ఆచూకి తెలియజేసినవారి వివరాలను రహస్యం ఉంచడంతో పాటు నగదు బహుమతి అందిస్తామని డీజేపీ పేర్కొన్నారు. దూబే చివరిసారిగా యూపీలోని ఆరయ్య ప్రాంతంలో గుర్తించినట్లు సమాచారం. అతను మధ్యప్రదేశ్‌ లేదా రాజస్తాన్‌ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. (చదవండి : ఒక్క ఫోన్‌ కాల్‌... అంతా తలకిందులైంది!)

కాగా  కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి దుబే గ్యాంగ్‌ పోలీసులపై కాల్పులకు తెగబడిన ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగిన విషయం విదితమే. ఇప్పటికే వికాస్ దూబే ప్రధాన అనుచరుడు దయా శంకర్ అగ్ని హోత్రిని యూపీ పోలీసులు కల్యాణ్‌ పూర్‌ లో అరెస్టు చేశారు. వికాస​ దూబేను పట్టుకోవడం కోసం దాదాపు 25 బృందాలు రంగంలోకి దిగాయి.

Advertisement
Advertisement