జలంధర్‌ దిష్టిబొమ్మ దహనం

Jalandhar Scarecrow burned - Sakshi

తల్లాడ ఖమ్మం : రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసి ఐపీ పెట్టిన వ్యాపారి పెరంబుదూరు జలంధర్‌ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు.  స్థానిక జలంధర్‌ ఇంటి వద్ద నుంచి ప్రదర్శనగా బయలు దేరి రైతులు, రైతు సంఘం నాయకులు బస్టాండ్‌ సెంటర్‌లో దిష్టిబొమ్మన తగులబెట్టారు.

ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాదినేని రమేష్, తాతా భాస్కర్‌రావు మాట్లాడారు. రూ.2.5 కోట్లకు ఐపీ పెట్టి రైతుల నోట్లో మన్ను కొట్టిన మిర్చి వ్యాపారిని అరెస్ట్‌ చేసి ఆయన ఆస్తులను వేలం వేసి రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.  

జలంధర్‌ను అరెస్ట్‌ చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. జలంధర్‌ను ర ప్పించి రైతుల సమక్షంలో చర్చించి ఎవరికెన్ని డబ్బులు ఇవ్వాలో మొత్తం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండో రోజు జలంధర్‌ ఇంటి వద్ద రైతులు, రైతు సంఘం నాయకులు, అఖిల పక్ష నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం అఖిలపక్షం, రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యాపారి ఇంటి ఎదుట రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

కార్యక్రమంలో బాధిత రైతుల పోరాట కమిటీ కన్వీనర్‌  గుంటుపల్లి వెంకటయ్య, రైతు సంఘం నాయకులు శీలం సత్యనారాయణరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి,  బీజేపీ నాయకులు ఆపతి వెంకటరామారావు, కాంగ్రెస్‌ నాయకులు కాపా రామారావు, దగ్గుల రఘుపతిరెడ్డి, గోవింద్‌ శ్రీను, వేమిరెడ్డి కృష్ణారెడ్డి, దర్మసోత్‌ ధశరధ్‌నాయక్, భూక్యా అంజయ్య, మహిళా సంఘం నాయకురాలు శీలం ఫకీరమ్మ, భాదిత రైతులు  పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top