కారు అమ్మడానికి వెళ్లి.. టెక్కీ అదృశ్యం | it engineer Disappear when sales his car | Sakshi
Sakshi News home page

కారు అమ్మడానికి వెళ్లి.. టెక్కీ అదృశ్యం

Dec 25 2017 6:49 AM | Updated on Dec 25 2017 6:49 AM

it engineer Disappear when sales his car - Sakshi

టెక్కీ అజితబ్‌ (ఫైల్‌)

వైట్‌ఫీల్డ్‌: ఒక ఐటీ ఇంజినీరు అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 18వ తేదీన తన కారును విక్రయించేం దుకు వెళ్ళిన అతడు కని పించడంలేదని తెలిపా రు. ఫిర్యాదు మేరకు వివరాలు యిలావున్నాయి. వైట్‌ఫీల్డ్‌లోని ఒక ఆపార్టుమెంట్‌లో పాట్నాకు చెం దిన అజితబ్‌ (29) తన స్నేహితుడితో నివాసం వు న్నాడు. అజితబ్‌ బెళ్ళందూరులోని ఒక కంపెనీలో టెక్కీ. తన వద్దవున్న కారును విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన చేశాడు.

మారుతీ క్లాజ్‌ కారును రూ. 12 లక్షలకు కొనుగోలు చేసినట్లు, దీన్ని 11లక్షల 80వేలకు విక్రయిస్తానని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. కొందరు ఈ కారు కొనడానికి ఫోన్‌ చేశారని, తాను వెళ్తున్నానని తన రూమ్‌మేట్‌కు తెలిపాడు. అలా వెళ్లిన వ్యక్తి తరువాత కనిపించలేదు.  అతని ఫోన్‌ పనిచేయలేదు. అప్ప టి నుంచి అతని ఆచూకీ తెలియరాలేదని టెక్కీ తమ్ముడు ఆర్ణబ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు కొనడానికి వచ్చిన వారే కిడ్నాప్‌ చేసివుంటారని అనుమానం వ్యక్తంచేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement