బెయిల్‌పై ఈశాన్యరెడ్డి విడుదల

Ishanya Pathireddy Release On Bail Hit And Run Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ర్యాష్‌ డ్రైవింగ్‌తో ప్రాణాన్ని బలితీసుకున్న కేసులో చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఈశాన్యరెడ్డికి కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైంది. కుషాయిగూడ డీఏఈ కాలనీలో ఆదివారం రాత్రి ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిపై కారు ఎక్కించి అతని మృతికి కారణమైన ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఈశాన్యరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ మహిళ జైలుకు తరలించారు. ఎట్టకేలకు ఆమెకు బెయిల్‌ రావడంతో జైలు నుంచి విడుదలైంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top