కోల్‌కతాలో హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ | Hyderabad Police Attacked On Cyber Gang Three Arrested In Kolkata | Sakshi
Sakshi News home page

కోల్‌కతాలో హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్

Aug 26 2019 8:32 PM | Updated on Aug 26 2019 8:51 PM

Hyderabad Police Attacked On Cyber Gang Three Arrested In Kolkata  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ డేటింగ్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్‌ ముఠా ఆట కట్టించారు పోలీసులు. కోల్‌కతా కేంద్రంగా అరాచకాలు సాగిస్తున్న కేడీలను కటకటాల వెనక్కి పంపారు. కోల్‌కతాలోని ఆన్‌లైన్‌ డేటింగ్‌ కంపెనీపై హైదరాబాద్‌ పోలీసులు దాడి చేసి 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణ జరిపి అందులో ముగ్గురిని అరెస్టు చేసి కలకత్తా కోర్టులో హాజరు పరిచారు. యువతి, యువకులను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి ఈ ముఠా లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement